నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి వాహనాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక వాహనం వేగంగా నడిపించడం చట్ట రీత్యా నేరం. సెక్షన్ 112 ప్రకారం వేగ పరిమితులకు విరుద్ధంగా మోటారు వాహనాన్ని నడిపితే శిక్షార్హులవుతారు. లైట్ వెహికల్ అయితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకూ జరిమానా విధించడం జరుగుతుంది.