ఈనెల 11న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటనతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి రెండో విడత అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తో ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. దీంతో అమ్మఒడి అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. అమ్మఒడి ఆర్థిక సాయం అందబోదని చాలామంది దిగులు పడ్డారు. అయితే అమ్మఒడిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఆరు నూరైనా ఆర్థిక సాయం ఆగదని, ఈనెల 11న కచ్చితంగా తల్లుల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ అవుతుందని భరోసా ఇచ్చింది.