దివీస్ పరిశ్రమ బాధితులకోసం పవన్ కల్యాణ్ బహిరంగ సభకు హాజరు కావడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూశాం. అయితే ఆ కార్యక్రమం పూర్తవగానే.. వకీల్ సాబ్ టీమ్ నుంచి ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ షూటింగ్ పార్ట్ పూర్తయిందని, ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ప్రకటించారు నిర్మాతలు. అంటే సినిమా షూటింగ్ పూర్తి కావడం వల్లే పవన్ శనివారం హడావిడిగా జనంలోకి వచ్చారని పరోక్షంగా చెప్పినట్టయింది.