పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి సంచలనం రేకెత్తించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో మరో సంచలనానికి తెరతీశారు. గతంలో తాను ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లపై వేటు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కారణంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ని కోరారు.