డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. ఆ ఇళ్లను అమ్ముకున్నా లేక అద్దెకిచ్చినా.. వాటిని తిరిగి తీసేసుకుంటామని బాంబు పేల్చారు కేటీఆర్. వాస్తవంగా ప్రభుత్వం నుంచి పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో ఇలాంటి నిబంధన ఉండేది. అసైన్ మెంట్ భూముల రూపంలో పేదలకు ప్రభుత్వం భూముల్ని బదిలీ చేస్తుంది. అలాంటి భూముల్ని పేదలు తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ క్రయ విక్రయాలు కుదరవు. అయితే లోపాయికారీగా అసైన్ మెంట్ భూముల విషయంలో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.