ఆదాయం విషయంలో ఏపీతో పోటీ పెట్టుకుని సర్వీసుల సంఖ్యలో పేచీ పెట్టి అనుకున్నది సాధించింది తెలంగాణ ఆర్టీసీ. అయితే ఆదాయం కోసం చేసిన ప్రయత్నం మాత్రం అనుకున్న స్థాయిలో సఫలం కాలేదు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ వద్ద లగ్జరీ బస్సులు తగినన్ని లేకపోవడంతో సర్వీసులు నడిపే విషయంలో పూర్తిగా చేతులెత్తేసింది.