మీకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇక కొన్ని మెచ్యూరిటీ కాలాలకు వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీని పెంచింది.