తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ సీఐ ఎం రవికుమార్ ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకున్నారు. ఆయన ఫేస్ బుక్‌ను హ్యాక్ చేశారు. తనకు డబ్బు అవసరం ఉందంటూ సీఐ పేరిట ఫేస్ బుక్ స్నేహితులకు సైబర్ నేరగాళ్లు అభ్యర్థనలు పంపారు. అయితే ఈ అభ్యర్థనను అనుమానించిన ఆయన స్నేహితులు నేరగా సీఐ రవికుమార్ కే ఫోన్ చేసి విషయం చెప్పారు.