"మేం పులి పిల్లలం.. పులుల్లాగే జీవిస్తాం కానీ, పిల్లుల్లా ఉండబోం.." అఖిల ప్రియ అరెస్ట్ వ్యవహారంపై ఆమె చెల్లెలు మౌనిక స్పందన ఇది. అఖిల ప్రియ అరెస్ట్ వెనక కుట్రకోణం ఉందని ఆరోపించిన మౌనిక.. తాము పులుల్లాగే బతుకుతామని, ఎవరికీ తలవంచబోమని తేల్చి చెప్పారు. భూమా నాగిరెడ్డి దంపతుల పిల్లలమని పులుల్లాగే ఉంటామని స్పష్టం చేశారు.