ఏపీలో చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్టాకంతా నిలబడిపోతోంది. 50శాతం రాయితీపై పంపిణీ చేసే కందిపప్పు, పంచదార విషయంలో ప్రభుత్వం నిబంధనలు మార్చింది. కేవలం 25శాతం సబ్సిడీతో మాత్రమే సరఫరా చేస్తుండటంతో పేదలు వాటిని కొనడానికి ఇష్టపడటంలేదు. దీంతో డీలర్ల వద్ద స్టాక్ మిగిలిపోతోంది. రేషన్ బియ్యం మాత్రం యథావిధిగా ఇచ్చేస్తున్నారు డీలర్లు.