స్థానిక ఎన్నికల విషయంలో ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పంచాయితీ నడిచింది. ఈ వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులతో సమావేశమై.. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పేసి సంచలనం సృష్టించారు నిమ్మగడ్డ. తాజాగా ఆయనకు ఉద్యోగులతో చిక్కొచ్చి పడింది. ఎన్నికల విధులకు తాము సిద్ధంగా లేమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ ఉద్యోగులనుంచి ఇలాంటి ప్రతిపాదన రాగా.. తాజాగా.. ఏపీ ఎన్జీవోలు ఎన్నికలు వద్దంటూ మొర పెట్టుకుంటున్నాయి.