రెవెన్యూ శాఖలో అవినీతికి వీఆర్వోలే కారణం అంటూ.. ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దుచేసి పడేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ రద్దు అమలులోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ వారికి ప్రత్యామ్నాయ విధులు కేటాయించలేదు. మరోవైపు రెవెన్యూలో కూడా వీఆర్వోల విధులను ఇతరులకు పూర్తి స్థాయిలో బదలాయించకపోవడంతో అక్కడ కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో వీఆర్వోల రద్దు విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.