రాజకీయాల్లోకి రాబోనంటూ రజినీకాంత్ తెగేసి చెప్పినా కూడా అభిమానులు ఆయన్ను వదలడంలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక చెన్నై వచ్చిన రజినీ.. పార్టీ పెట్టట్లేదని, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అప్పట్లో అభిమానులెవరూ ఆయనపై ఒత్తిడి తేలేదు, ఇతర నాయకులు కూడా ఆయన్ను కలసి పార్టీపై పునరాలోచించుకోవాలని కోరలేదు. కానీ ఇప్పుడు రజినీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ అభిమానులు రోడ్లెక్కుతున్నారు.