ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగానే హైలైట్ అవుతున్నారు. గత కొంతకాలంగా పవన్, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. వరుసగా పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే పలువురు మంత్రుల టార్గెట్‌గా విమర్శలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా పవన్‌కు కౌంటర్లు పడుతున్నాయి.