ఇటీవల కాలంలో ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు కావాలని ఆలయాలని టార్గెట్ చేసి దేవుడు విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. ఇక ఈ దాడులకు కారణం జగన్ ప్రభుత్వమే అని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తుంది. జగన్ క్రిస్టియన్ అని అందుకే హిందూ ఆలయాలపై దాడులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో హిందూత్వం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.