చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు, ఎప్పటి నుంచో తన కుమారుడుకు పట్టం కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు లోకేష్‌ని పార్టీలో యాక్టివ్ చేసిన బాబు, 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, చినబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. ఇక మంత్రిగా చినబాబు పనితీరు ఎలా ఉన్నా, అలా పదవి ఇవ్వడంపై విమర్శలు గట్టిగానే వచ్చాయి.