టీకా నాణ్యతపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళ.. దేశంలో తొలి టీకా మోదీకి వేయాలని పట్టుబట్టారు కొంతమంది నేతలు. మోదీ, అతని కేబినెట్ సహచరులకు ముందు టీకా వేసి, ఆ తర్వాత సామాన్య ప్రజలకు వేయాలని సూచించారు. టీకా సామర్థ్యంపై సందేహాలు వెలిబుచ్చారు. అయితే టీకా విషయంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారు. తనతో సహా ప్రజా ప్రతినిధులెవరూ తొలి దశలో టీకా వేయించుకోరని చెప్పారు.