ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వచ్చిన తీర్పుల విషయంలో న్యాయమే గెలిచిందని, తమకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని చెబుతూ వచ్చేవారు టీడీపీ నేతలు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ని హైకోర్టు రద్దు చేయడంతో.. టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుని తాము గౌరవిస్తున్నామని చెబుతూనే.. కోర్టుకి తప్పుడు సమాచారం అందించారంటూ విమర్శలు మొదలు పెట్టారు.