ఈనెల 16నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఏపీలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. అయితే తొలి విడత ఏపీకి 5లక్షల టీకా డోసులు పంపిణీ అవుతున్నాయి. వీటిలో 4లక్షల టీకా డోసులు కొవిషీల్డ్ కంపెనీవి కాగా.. మిగతా లక్ష టీకా డోసులు కొవాక్సిన్ కావడం విశేషం. కొవాక్సిన్ టీకాలు తగినంతగా అందుబాటులో లేకపోవడంతో.. కొవిషీల్డ్ కంపెనీ టీకాలు ఎక్కువగా ఏపీకి సరఫరా అవుతున్నాయి.