పండగల సీజన్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కి నిజంగా పండగే.. డబుల్, ట్రిపుల్ రేట్లు వడ్డించి, ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తుంటాయి ప్రైవేట్ సంస్థలు. ఆర్టీసీది కూడా అదే బాట అయినా వారిది కాస్త రీజనబుల్. ప్రైవేట్ సంస్థలు మరీ బరితెగించి దోపిడీకి పాల్పడతాయి. అవసరం కొద్దీ ఎంత రేటయినా టికెట్ కొని ప్రయాణించాలనుకోవడం జనం బలహీనత. దీన్ని అడ్డు పెట్టుకుని పండగ సీజన్లో పండగ చేసుకుంటాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.