దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి.. ఇంకా ఏపీకి చేరలేదని స్పష్టం చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు. ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ లేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ తో ఏ ఒక్క కోడి కానీ, పక్షి కానీ చనిపోలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే వ్యాధి పట్ల ప్రజల్లోని భయాందోళనలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారాయన. రాష్ట్రంలో 829 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలతో పాటు జిల్లాకో టాస్క్ ఫోర్స్ కమిటీ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు మంత్రి అప్పలరాజు.