గత ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్స్ కూడా స్వీకరించి, కరోనా మొదలైందని చెప్పి ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికలు వాయిదా పడ్డాక, జగన్ ప్రభుత్వం, నిమ్మగడ్డల మధ్య ఎలాంటి వార్ జరిగిందో అందరికీ తెలిసిందే.