ఏపీలో మంత్రి కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే విషయం తెలిసిందే. చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలు మీద వెళ్లిపోతారు. ఏ మాత్రం మొహమాట పడకుండా చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై కాస్త పరుష పదజాలం వాడే విమర్శలు చేస్తారు. ఇక ఆయన విమర్శలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అయితే కొడాలి నాని టీడీపీ నుంచే రాజకీయ జీవితం మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీలోకి వచ్చి మరో రెండు సార్లు గెలిచి, ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.