కింజరాపు ఫ్యామిలీ...ఏపీ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచే కుటుంబం. వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంకు చెందిన ఈ ఫ్యామిలీకి రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయగల సత్తా ఉంది. కష్టాల్లో ఉన్న ప్రతిసారి టీడీపీకి అండగా ఉండేది ఈ కుటుంబమే. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి కింజరాపు ఫ్యామిలీ కృషి బాగానే ఉంటుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీలో దివంగత ఎర్రన్నాయుడు టీడీపీ తరుపున కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, తనయుడు రామ్మోహన్ నాయుడులు కష్టపడుతున్నారు.