అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భార్యను వదిలేయడానికి ప్రయత్నిస్తున్న ఓ భర్తకు తగిన గుణపాఠం జరిగింది. బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్న ఆయనను అందరూ చూస్తుండగానే భార్య అతడిని దేహశుద్ధి చేసింది. భార్యపై అనుమానం పెంచుకుని.. ఆమెను వదిలించుకోవడానికి వేరొక మహిళతో సహజీవనం చేస్తున్నాడని గ్రహించి ఆఫీస్లో గల్లా పట్టుకుని కొట్టింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.