పతంగులు ఎగరేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదా ఒక్కొక్కసారి ప్రాణాలమీదకు కూడా వస్తుంది. ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఓ యువకుడి మెడకు ”మాంజా” దారం చుట్టుకుని గొంతు తెగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ దారుణ ఘటన జరిగింది. పండగ వేళ కుటుంబంలో విషాదం నింపింది.