ఇప్పటి వరకూ సీఎం జగన్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే చూస్తున్నాం. మద్యపాన నిషేధంలో తొలి అడుగుగా.. మద్యం ధరల్ని పెచండం, బ్రాండ్లను తగ్గించడంతో కొంతమంది బాగా ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ చార్జీలు అధికారిక ప్రకటన లేకుండానే పెంచడంతో మరికొందరు వాయిస్ పెంచారు. ఇప్పుడు రహదారుల భద్రత, నిర్వహణ పేరుతో వాహనదారులపై భారీగా భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.