కరోనా ప్రబలుతున్న కొత్తల్లో వ్యాధి నిర్థారణ పరీక్షల్లో తెలంగాణ కంటే ఏపీ మెరుగైన స్థానంలో ఉండేది. ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల ఏపీలో కేసులు ఎక్కువగా బయటపడ్డాయని, తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువగా జరిగిందనే అపవాదు కూడా ఉంది. అయితే ఆ తర్వాత క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలుగు రాష్ట్రాల సన్నద్ధతపై మరోసారి పోలిక మొదలైంది. వ్యాక్సినేషన్ విషయంలో ఇరు రాష్ట్రాలు ఏర్పాట్లు ముమ్మరం చేసినా.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చేసే సపర్యల విషయంలో తెలంగాణ ఓ అడుగు ముందుకేసినట్టు అర్థమవుతోంది.