నటుడు సోనూ సూద్, ముంబై నగర పాలక సంస్థ మధ్య గొడవ చినికి చినికి గాలి వానలా మారుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు బాంబే హైకోర్టులో పంచాయితీ పెట్టాయి. అది తీరే సందర్భంలో సోనూ సూద్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ముంబై నగర పాలక సంస్థ. సోనూ సూద్ నేరాలకు అలవాటు పడిన వ్యక్తి అని సంబోధిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో కూడా పలుమార్లు ఆయన నియమాలను ఉల్లంఘించారని, అయినా కూడా ఆయన తన అలవాటు మానుకోలేదని, ఆయన నేరాలకు అలవాటు పడిన వ్యక్తి అని, పాత నేరగాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈకేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.