రజినీకాంత్ రాజకీయ అరంగేట్రానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని అందరూ భావిస్తున్న వేళ.. అభిమానులంతా మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ సూపర్ స్టార్ మరోసారి స్పష్టం చేశారు కూడా. రజినీ మాట మేరకు అభిమానులు వెనక్కి తగ్గినా.. తమిళనాట రాజకీయ నాయకులు మాత్రం మరింతకాలం వేచి చూస్తామంటున్నారు. కమల్ హాసన్ మాజీ సహచరి, ప్రస్తుత బీజేపీ నేత గౌతమి రజినీ రాజకీయాల్లోకి రావాలి, వచ్చి బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే విషయంలో రజినీ పునరాలోచించాలని కోరారు గౌతమి.