కృష్ణా జిల్లా టీడీపీ పేరు చెబితే...ఎక్కువగా గుర్తొచ్చేది మాజీ మంత్రి దేవినేని ఉమానే. గత రెండు దశాబ్దాల నుంచి టీడీపీలో పెత్తనం ఈయనదే. జిల్లాలో టీడీపీ తరుపున బడా నేతలున్న, ఉమా అండర్లో ఉండాల్సిందే అని విధంగా రాజకీయాలు జరుగుతూ వచ్చేవి. ఉమాకు జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన ఆ నియోజకవర్గాలపై పెత్తనం చేయడానికి చూసేవారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలకు ఇది ఇష్టం లేకపోయినా, తప్పక దేవినేని అండర్లో నడిచేవారు. ఎందుకంటే ఉమా చంద్రబాబుకు దగ్గరగా ఉండే వ్యక్తి.