జనసేన అధినేత ఎప్పటిలాగే పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ, అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఇలా పవన్ కెరీర్ కొనసాగుతుండటంతో, ఏపీలో జనసేన కొంచెం కూడా బలపడలేదు. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు పవన్ పోటీ చేయకుండా 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి అధికారంలోకి రావడానికి కృషి చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చాక పవన్ సినిమాలు చేయకపోయినా, పూర్తి స్థాయిలో రాజకీయం చేయకుండా, పార్టీని బలోపేతం చేయకుండా కాలం గడిపేశారు.