రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ తో పాటు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 18-40 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది.