అమ్మఒడి పథకం ఓ అమ్మ ఉసురు తీసింది. అమ్మఒడి డబ్బులకోసం ఏకంగా భార్య ప్రాణాలే తీశాడు ఓ భర్త. నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఉదంతం విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోటలో జరిగింది. అమ్మఒడి డబ్బుల్ని వృథా కానివ్వకుండా పిల్లలకోసం దాచిపెట్టడమే ఆ అమ్మ చేసిన తప్పయింది. పిల్లల భవిష్యత్ కోసం భర్తతో సైతం వాదులాడింది. చివరకు ప్రాణాలే కోల్పోయింది.