ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో శ్రమించాయి. బ్రెజిల్లో తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. చైనా ప్రభుత్వరంగానికి చెందిన సినోవాక్ టీకా సామర్థ్యం కేవలం 50.4 శాతమేనని అక్కడి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.