20 నెలలకే నిండు నూరేళ్లూ నిండాయి. బోసి నవ్వులతో, బుడి బుడి అడుగులతో కన్నవారి కళ్లల్లో ఆనందం నింపాల్సిన ఆ పసిపాప.. అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితేనేం.. తాను వెళ్తూ వెళ్తూ మరో ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ధనిష్తా అనే ఆ 20 నెలల చిట్టితల్లి.. ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయసు అవయవ దాతగా నిలిచింది. ఐదుగురి ప్రాణాలను కాపాడింది..