కిడ్నీలకు ఏ చిన్న సమస్య వచ్చినా శరీరమంతా మలినమైపోతుంది. అయితే మూత్రపిండాలు రక్తంతోపాటు శరీరాన్ని మొత్తం శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల అనేక మంది కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అతి తక్కువ వయస్సు ఉన్న వారు కూడా కిడ్నీ వ్యాధులకు గురి కావడం, డయాలసిస్ వరకూ వెళ్లడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆరోగ్య అలవాట్లు, అజాగ్రత్తల వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.