అఖిల ప్రియ కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు అఖిల ప్రియను తమ కస్టడీలో ఉంచుకుని విచారణ జరిపిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. అయితే అఖిల ప్రియ ముందుగా తనకేం తెలియదని చెప్పినా.. ఆధారాలు చూపించి మరీ పోలీసులు ఆమెతో నిజం ఒప్పించారట. సీసీ టీవీ ఫుటేజీలు ఈ విషయంలో పోలీసులకు బాగా ఉపయోగపడ్డాయని అర్థమవుతోంది. అసలీ ఆధారాలన్నీ పోలీసుల వద్ద ఉంటాయని అఖిలప్రియ ఊహించలేదట. అయిత అన్ని ఆధారాలు తమ వద్ద పెట్టుకున్న పోలీసులు ఒక్కొక్కటే బైట పెట్టి ఆమెకు ట్విస్ట్ ఇచ్చారు. అసలు విషయం రాబట్టారు.