కరోనా నిర్థారణకు చాలారకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనాని నిర్థారించలేరు కానీ.. గతంలో కరోనాతో బాధపడ్డారా లేదా అనే విషయాన్ని యాంటీబాడీ టెస్ట్ తో చెప్పేయొచ్చు. అంటే అప్పటికే కరోనా సోకి, దానినుంచి కోలుకుని, శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయినవారు ఈ టెస్ట్ లో పాజిటివ్ అవుతారనమాట. ఈ టెస్ట్ లో యాంటీబాడీస్ కనపడితే వారికి కరోనా ఉన్నట్టు కాదు, కరోనాను జయించినట్టు. తమకి తెలియకుండా కరోనా వచ్చి, లక్షణాలేవీ లేకుండా తమకు తెలియకుండానే వ్యాధినుంచి బైటపడినవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారందరూ యాంటీబాడీ టెస్ట్ లో బయటపడతారు.