జనవరి 17న దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన పోలియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది. జనవరి 31కి దాన్ని తిరిగి మొదలు పెడుతోంది. తొలుత కరోనా వ్యాక్సినేషన్ కోసమే పోలియో వ్యాక్సినేషన్ వాయిదా వేశారని అనుకున్నా.. కరోనా పని పూర్తి కాకముందే పోలియో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టడం విశేషం. అయితే చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే కరోనా తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, పోలియో టీకా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు అధికారులు. కరోనా వ్యాక్సినేషన్ లో టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే పోలియో డ్రాప్స్ వేయడానికి విధులు కేటాయిస్తారు.