తెలుగు రాష్ట్రాల్లో శైవభక్తులకు శ్రీశైలం పరమపావన క్షేత్రం. శ్రీశైలంలో మద్యం, మాంసం వినియోగం నిషిద్ధం. తిరుమల కొండపై ఎలాంటి ఆచార సంప్రదాయాలను పాటిస్తారో.. శ్రీశైల క్షేత్రంలో కూడా దాదాపుగా అలాంటి నియమాలనే పాటిస్తారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. శ్రీశైలంలో కలకలం రేపాయి. అన్య మతస్థులకు శ్రీశైలంలో షాపుల లైసెన్స్ లు కేటాయించారని ఆమధ్య ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అన్యమత గ్రంథం దొరకడంతో ఓ వ్యక్తిని ఆలయంలోకి అనుమతించలేదు. అయితే అవి సద్దుమణిగేలోపే ఇప్పుడు శ్రీశైలంలో చికెన్, మటన్ వినియోగం కలవర పెడుతోంది.