మోదీ ఎంతటి బలవంతుడైనా కొవొచ్చు కానీ, కాంగ్రెస్ బలహీన పడటం వల్లే ఆయన ఆటలు సాగుతున్నాయని చాలామంది అభిప్రాయం. రాహుల్ గాంధీ సమర్థుడు కాకపోవడం వల్లే కేంద్రంలో ఎన్డీఏ ఆడింది ఆట, పాడింది పాటగా ఉందని అంటారు. ఈ అభిప్రాయం ఎలా ఉన్నా.. ఇన్నాళ్లూ మోదీకి సరిగ్గా పోటీ ఇచ్చేవారెవరూ తెరపైకి రాలేదనడం మాత్రం కరెక్ట్. కేజ్రీవాల్ కాస్త హడావిడి చేసినా ఆయన ఢిల్లీ వరకే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు సామాజిక కార్యకర్త అన్నా హజారే తెరపైకి వస్తున్నారు. వయసు సహకరించకపోయినా.. ఆయన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరు మొదలు పెట్టబోతున్నారు. హజారే బైటకు వస్తే.. మోదీపై కచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.