మనుషులు తప్పు చేస్తేనే శిక్షిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఆస్ట్రేలియాలో ఒక పావురం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఒక రేసింగ్ పావురాన్ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అమెరికా నుంచి వచ్చిన రేసింగ్ పావురమని వారు భావించారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని చంపేయాలని భావించారు.