టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. చాల మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. కొన్ని పరిశోధనల్లో తేయాకు తాగడం మంచిదని తేలితే మరికొన్ని పరిశోధనల్లో టీ సేవనం అంత మంచిది కాదని తేలింది. అయితే పరగడుపునే టీ తాగితే టీలోని కెఫీన్ ఒంటికి చేరి చురుకుదనం పెంచుతుంది. కానీ పరగడపున టీ తాగటం చాలా ప్రమాదకరమని తేలింది. అంతేకాదు టీతోపాటు మనం తీసుకునే కొన్ని పదార్థాలతో కూడా కాస్త హానికరమైనవేనట.