జనసేనాని పవన్ కల్యాణ్ కు సైనికులన్నా, సైనిక బలగాలన్నా అపారమైన గౌరవం, భక్తిభావం. తన సినిమాల్లోని పాటలలో సైతం దేశభక్తిని చాటుకుంటూ, సైనిక నిరతిని ప్రశంసిస్తుంటారు పవన్ కల్యాణ్. గతంలో భారత రక్షణ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కోటి రూపాయల విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు పవన్ కల్యాణ్. ప్రతి ఏటా ఆయన తన విరాళాన్ని తప్పనిసరిగా ఆ నిధికి కేటాయిస్తూ వస్తున్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఆర్మీడే రోజు పెట్టిన భావోద్వేగ పోస్ట్ మరోసారి నెటిజన్ల మనసు గెలుచుకుంది.