శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎంపీగా ఓ వైపు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగానే గళం విప్పుతున్న రామ్మోహన్...టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక, చంద్రబాబుకు అండగా ఉంది కింజరాపు ఫ్యామిలీనే. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు పార్టీ తరుపున గట్టిగా కష్టపడుతున్నారు.