గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని చెప్పి, టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే పరిటాల ఫ్యామిలీ నుంచి సునీత పోటీ చేయకుండా, తన తనయుడు శ్రీరామ్‌కు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఇక రాప్తాడు బరిలో నిలిచిన శ్రీరామ్, వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇలా ఘోరంగా ఓడిపోవడం, పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో పరిటాల ఫ్యామిలీ సైలెంట్ అయింది.