భారత్ లో మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకముందే కొవాక్సిన్ కి అనుమతులిచ్చేశారంటూ రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న వేళ.. భారత్ బయోటెక్ సంస్థ తమ టీకా వేసుకునేవారికి ఓ ఆఫర్ ఇచ్చింది. కొవాక్సిన్ తీసుకున్నవారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా, ఒకవేళ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా పూర్తిగా నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఆ సమస్యలు తమ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లేనను రుజువు కావాలని చెప్పింది. తమ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, ప్రయోగాలు పూర్తికాలేదనే కారణంతో దాన్ని తక్కువచేసి చూడొద్దని భరోసా ఇచ్చింది. నష్టపరిహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత్ బయోటెక్ సంస్థ.