జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో తాడో పేడో తేల్చుకోబోతున్నారని, ఈనెల 21న కీలక ప్రకటన చేయబోతున్నారని పొలిటికల్ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. బీజేపీ, జనసేన పార్టీకి మధ్య తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో పీటముడి పడింది. ఆ సీటు తమకి తావాలంటే, లేదు తమకే కావాలంటూ రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. రోజులు గడుస్తున్నా, ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిపై మాత్రం ఇంకా తేలలేదు. ఆ సీటుని గట్టిగా డిమాండ్ చేస్తున్న పవన్ కల్యాణ్, ఈనెల 21న తిరుపతిలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమావేశం చివర్లో ఆయన తిరుపతి అభ్యర్థిపై కీలక ప్రకటన చేస్తారని, లేకపోతే బీజేపీ పొత్తుపైన అయినా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.