ఆన్లైన్లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఫ్రీ ఇన్నర్‌వేర్ స్కీమ్ అంటూ ఓ వ్యక్తి పేరుతో ఫేక్ డిటేల్స్ నమోదు చేశాడు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా టీనేజ్ అమ్మాయిల వివరాలు తీసుకొని వారికి మెసేజెస్ చేస్తున్నాడు. ఫ్రీ ఇన్నర్‌వేర్ స్కీమ్‌కు మీరు అర్హులు అంటూ వారిని ఇబ్బందులు పెడుతున్నాడు. అంతేకాదు వారి న్యూడ్ ఫోటోలు పంపిస్తే సైజులు చూస్తానని అసభ్యంగా మెసేజ్ లు పెట్టారు. 18 ఏళ్ల ఓ అమ్మాయి అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి చిరునామా ట్రేస్ చేసి పక్కా ప్రణాళికతో అతడిని అరెస్ట్ చేశారు.